వికీపీడియా:సహాయ కేంద్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


కొత్త సభ్యులు వికీని త్వరగా అర్థం చేసుకునేందుకు 5 నిమిషాల్లో వికీ పేజీని చూడండి.

గమనిక: ఇక్కడ ప్రాపంచిక ప్రశ్నలు అడగరాదు (ఉదా.., మన ప్రధాన మంత్రి ఎవరు?)

సహాయ కేంద్రానికి స్వాగతం! వికీపీడియా గురించిన ప్రశ్నలు అడగటానికీ, వ్యాసాలు రాసే విషయంలో సహాయం పొందటానికి ఇదే సరియైన స్థలం. ఎక్కువగా కొత్తవారి ప్రశ్నలకు సమాధానాలిస్తాం, కాని అనుభవజ్ఞులూ అడగవచ్చు. ప్రశ్న రాసిన తరువాత, సమాధానాలు వచ్చాయేమో చూడటానికి ఈ పేజీని చూస్తూ ఉండండి.


ప్రశ్న ఎలా అడగాలి

  • ముందుగా, మీ ప్రశ్నకు ఇదివరకే సమాధానం ఇచ్చేసారేమో చూడండి. చాలా ప్రశ్నలకు తరచుగా అడిగే ప్రశ్నల లో సమాధానాలు దొరుకుతాయి.
  • ప్రశ్నలకు ఒక అర్ధవంతమైన శీర్షిక పెట్టండి, దానికి అర్ధవంతమైన సమాధానం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
  • సూటిగా, వివరంగా అడగండి.
  • ప్రశ్న చివర సంతకం పెట్టండి. మీకు వికీపీడియా లో సభ్యత్వం ఉంటే, ~~~~ అని టైపు చెయ్యండి. లేకపోతే, మీ పేరు రాయవచ్చు లేదా ఆకాశరామన్న అని రాయవచ్చు.
  • ప్రశ్నలకు ఈ-మెయిల్‌ లో సమాధానాలు ఇవ్వరు కాబట్టి, ఈ-మెయిల్‌ అడ్రసు ఇవ్వకండి. పైగా వికీపీడియాలో విషయాలు యథేఛ్ఛగా కాపీ చేసుకోవచ్చు కనుక మీ ఈ-మెయిల్‌ కు గోప్యత ఉండదు.
  • అప్పుడప్పుడూ ఈ పేజీని చూస్తూ ఉండండి. ఎందుకంటే, సమాధానం ఒక్కసారే రాకపోవచ్చు, అది ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి.
  • మీ ప్రశ్నకు అనుబంధంగా ఇంకా అడగాలంటే, మీ ప్రశ్న విభాగం పక్కనే ఉండే [మార్చు] లింకును నొక్కి ప్రశ్నను రాయండి. ఒకే ప్రశ్నపై బహుళ విభాగాలు ప్రారంభించవద్దు.
  • అన్ని వయసుల పాఠకులూ ఈ పేజీ చూస్తారని గుర్తుంచుకోండి.
  • ప్రశ్న తెలుగులో లేక ఇంగ్లీషులో అడగండి. తెలుగుని ఆంగ్ల అక్షరాలతో రాయకండి, అర్ధం చేసుకోవడం కష్టమవుతుంది.
  • ప్రశ్నలకు సమాధానాలు మనుష్యులే ఇస్తారు, కంప్యూటర్లు కాదు. ఇది సెర్చ్‌ ఇంజిన్‌ కాదు.


సమాధానం ఎలా ఇవ్వాలి

  • వీలయినంత విపులమైన సమాధానం ఇవ్వండి.
  • క్లుప్తంగా ఇవ్వండి, కరకుగా కాదు. స్పష్టంగా, సులభంగా అర్ధమయ్యే విధంగా రాయండి. ప్రశ్న పరిధికి లోబడి సమాధానం ఇవ్వండి.
  • సమాధానం తెలుగులోనే ఇవ్వండి.
  • వికీపీడియా లోని పేజీలకు లింకులు ఇవ్వండి. దీనివలన మరింత సమాచారం దొరుకుతుంది.
  • వాదాలకు ఇది వేదిక కాదు. ఏ విషయంపైనైనా వాదించాలనుకుంటే, ఆ విషయపు చర్చా పేజీ వాడండి.

అనువాదం ఎలా?[మార్చు]

YesY సహాయం అందించబడింది

నేను ఇంగ్లీషులో ఉన్న విషయాలను తెలుగులోకి అనువదించడానికి ఏం చేయాలి

Bvlk manohar (చర్చ) 07:43, 6 అక్టోబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Bvlk manohar గారు, ప్రత్యేక:ContentTranslation పేజీలో ఇతర వికీల వ్యాసాలను తెలుగులోకి అనువాదం చేయవచ్చు. మరింత సమాచారానికి వికీపీడియా:వికీప్రాజెక్టు/అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి చూడండి. --అర్జున (చర్చ) 04:33, 12 అక్టోబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
Bvlk manohar గారు, అన్నట్లు ఇటువంటి సందేహాలను మీ వాడుకరి చర్చాపేజీలో అడగవచ్చు. ఈ పేజీ ప్రధానంగా వాడుకరి ఖాతా లేని వారిసందేహాలకొరకు ఉద్దేశించబడింది.--అర్జున (చర్చ) 04:34, 12 అక్టోబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

వర్గం:Category:మమ్మీలు పేజీ ని తొలగించమని కోరుతున్నాను[మార్చు]

ఒక వ్యాసానికి అనువాదం చేస్తున్నప్పుడు వర్గాలు లో పై విధంగా పేజీ ఓపెన్ కావడానికి వీలుగా ఉండడంతో పై పేజీని ప్రారంభించాను. తర్వాత పై పేజీ పేరు సమంజసంగా లేదని భావించి పేజీని కొత్తగా ప్రారంభించి దానిలో కొన్ని మమ్మీల వ్యాసాలను కలిపాను. కావున వర్గం:Category:మమ్మీలు పేజీ ఇక ఖాళీగా ఉంటుంది. ఇక ఈ పేజీ వర్గం:Category:మమ్మీలు అవసరముండదు కాబట్టి తొలగించమనికోరుతున్నాను.--Vmakumar (చర్చ) 23:55, 15 అక్టోబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

నిరోదించండి[మార్చు]

తె.వి నిర్వాహకులకు మనవి. 59.92.163.106 ఐపి అడ్రస్ గల వ్యక్తి చాలా పేజీలలో గ్రామం వ్యాసాలందు విధ్వంసం పనులు చేస్తున్నారు... కావున పరిశీలించి, నిరోధించగలరు.ప్రభాకర్ గౌడ్ నోముల(చర్చ)• 18:38, 4 నవంబర్ 2020 (UTC)
@ప్రభాకర్ గౌడ్ నోముల గారూ, ఇటీవలి మార్పులను ఎప్పటికప్పుడూ తనిఖీ చేస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. ఉంగుటూరు (కృష్ణా జిల్లా) పేజీలో ఆ ఐపీ అడ్రసు చేసిన మార్పులను పరిశీలించాను. అందులో చేర్చిన సమాచారంలో విధ్వంసం కనిపించలేదు గానీ, ఖాళీ విభాగాలు చేర్చడం కనిపించింది. మూలం లేకుండా "ప్రముఖుల" గురించి రాసారు. అవి విధ్వంసకర మార్పులు కాకపోవచ్చు. ఐపీ అడ్రసు కాబట్టి వారితో చర్చించే అవకాశం లేదు. మీరెలాగూ వారు చేసిన మార్పులను వెనక్కి తిప్పారు కాబట్టి, వారికి తమ లోపం తెలిసి వస్తుందనుకుందాం. మళ్ళీ అలాంటి మార్పులు చేస్తే తదుపరి చర్య సంగతి ఆలోచిద్దాం.
పోతే, ఈమధ్య ఒక లాగినైన వాడుకరి ఎవరో గ్రామాల పేజీల్లో ఖాళీ విభాగాలు పెట్టారు. (వారెవరో నాకు గుర్తు రావడంలేదు.) అప్పుడు మీరూ మరి కొందరూ వాటిని వెనక్కు తిప్పారు. ఆ వాడుకరికి అలా చెయ్యవద్దని సలహా ఇచ్చారా? లేదంటే , వారెవరో మీకు గుర్తుంటే, ఇప్పుడైనా సలహా ఇవ్వవచ్చు. ఆలస్యమైనా పర్లేదు, అసలివ్వనిదానికంటే నయమేగా. పరిశీలించండి. చదువరి (చర్చరచనలు) 07:22, 5 నవంబర్ 2020 (UTC)
చదువరి గారు, ధన్యవాదాలు మీరు అన్న వారు. రమ్య ఈమధ్య లాగినైన వాడుకరి గ్రామాల పేజీల్లో ఖాళీ విభాగాలు పెట్టారు. కొత్త వాడుకరి వీరికి చర్చాపేజీలో ను వివరించాను, ప్రణయ్ గారు ఒకరోజు నిరోధం విధించారు. ఈ వాడుకరి కూడా ఇలాగే ఖాళీ విభాగాలు చేర్చిన పద్ధతి ఒకే విధంగా ఉంది. ఇప్పటికే ఎర్ర రామారావు గారు ప్రణయ్ గారు కూడా అలా ఖాళీ విభాగాలు చర్చ వద్దని సలహా ఇచ్చారు. అయినా ఆ వాడుకరి కొనసాగింపు సాగిస్తున్నారు. ఈ విషయమై స్పందించిన అందుకు మీకు ధన్యవాదాలు సార్.ప్రభాకర్ గౌడ్ నోముల(చర్చ)• 07:49, 5 నవంబర్ 2020 (UTC)
Ramya Kanumalli అనే వాడుకరి కొన్ని గ్రామాల పేజీల్లో ఖాళీ విభాగాలు పెట్టారు, మరికొన్ని సవరణలు కూడా చేసారు. ఖాళీ విభాగాలు పెట్టినవాటిని వెనక్కు తిప్పడంతోపాటు ఉపయోగకరమైన ఎడిట్స్ చేసిన వాటికి ధన్యవాదాలు కూడా పంపించాము. అంతేకాకుండా సదరు వాడుకరి చర్చ పేజీలో వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల గారు, వాడుకరి:యర్రా రామారావు గారు సలహా కూడా ఇవ్వడం జరిగింది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:53, 5 నవంబర్ 2020 (UTC)
సరేనండి ప్రభాకర్ గౌడ్ గారు, ప్రణయ్ గారు. ఈ ఐపీఅడ్రసు చేసే మార్పులను గమనిస్తూ ఉందాం. __చదువరి (చర్చరచనలు) 09:51, 5 నవంబర్ 2020 (UTC)

వికీ సోర్స్ గురించి[మార్చు]

YesY సహాయం అందించబడింది


వికీ సోర్స్ లో కొన్ని ఎలక్ట్రానిక్ పుస్తకాలు (గ్రంధాలు) గ్రంధ స్వామ్య పరిమితిలో లేనివి/అనుమతించబడినవి అప్లొడ్ చేయవచ్చా? ఆ ప్రక్రియ తెలుపగలరు . ఉదాహరణకి మహాకవి దాసు శ్రీరాములు గ్రంధాలు. ధన్యవాదాలు --VJS (చర్చ) 14:33, 16 ఏప్రిల్ 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

VJS (చర్చ) 14:33, 16 ఏప్రిల్ 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

VJS గారు, చేయవచ్చు. ఇప్పటికే కొన్ని గ్రంథాలు వికీసోర్స్ లో వున్నాయి.( s:రచయిత:దాసు శ్రీరాములు ). కామన్స్ లో ఫైల్ ఎక్కించి, ఆ తరువాత వికీసోర్స్ లో పాఠ్యీకరణ చేయండి. అర్జున (చర్చ) 21:46, 16 ఏప్రిల్ 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు. మళ్ళీ అవసరమైతే సంప్రదిస్తాను.--VJS (చర్చ) 05:22, 17 ఏప్రిల్ 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

కామన్స్ లో ఫైల్ అప్లోడ్ చేయటం[మార్చు]

అర్జున గారు. నేను కామన్స్ లో ఒక ఫైలును అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేసాను. (Ref: దస్త్రం:తెలుగునాడు- అను ఆంధ్రవీధిలో బ్రాహ్మణ ప్రశంస.pdf) ఈ ఫైలును డా. దాసు అచ్యుతరావు గారు (మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి) నాకు ఉచితముగా పంపిణీ చేయుటకు, వికిపీడియా లో ఉంచుటకు, విద్యావసరాలకు ఇచ్చారు. వారు మా మామయ్య గారు. మహాకవి దాసు శ్రీరాములు గారు మా ముత్తాతగారు. ఇటువంటి గ్రంధాలు దాదాపు 15 PDF రూపములో నాకు ఇచ్చారు. అయనే ప్రచురణకర్త. నేను ఆయనకు కొంతవరకు సాంకేతిక సహకారం అందిస్తుంటాను. ఈ ఫైలు ఈక్రింది వెబ్ సైట్ లలో ఉచితముగా లభింపచేశాము. హైదరాబాదు విశ్వవిద్యాలయ గ్రంధాలయ సూచిక: http://igmlnet.uohyd.ac.in:8000/hi-res/hcu_images/297623.pdf ఆంధ్రభారతి కావ్యాలు: https://andhrabharati.com/kAvyamulu/telugunADu/index.html దీనికి తగిన అధికార/అనుమతి పత్రం నాకు ఈమెయిల్ ద్వారా ఇదివరలో హైదరాబాదు విశ్వవిద్యాలయ గ్రంధాలయం లో ఉంచడానికి ఇచ్చారు. ఇప్పుడు కూడా ఈయమని చెప్పాను. ఈ ప్రక్రియ సరిపొతుందా కామన్స్ లో చేయడానికి. నాకు ఈ విషయంలో మార్గదర్శనం చేయగలరు. ధన్యవాదాలు --VJS (చర్చ) 11:26, 18 ఏప్రిల్ 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

@Vjsuseela గారు, మీరు ఉదహరించిన పుస్తకం 1929 కూర్పు కామన్స్ లో వుంది కాని రెండు పేజీలు ఒకే బొమ్మరూపంలో వుంది కావున పాఠ్యీకరణలో OCR సాంకేతికాలు వాడడానికి సహకరించదు. దానిని ఒకపేజీ ఒకబొమ్మ రూపంలోకి మార్చాలి. ఇక మీరిచ్చిన లింకు 1974 కూర్పుది. దానిలో నకలుహక్కులు మహాకవి దాసు శ్రీరాములు స్మారకసమితికి చెందినవిని పేర్కొన్నందున, ఆ సమితి ప్రధాన కార్యనిర్వహధికారి, ఆ పుస్తకాలను CC-BY-SA 4.0 తో మరల విడుదల చేస్తే, కామన్స్ లోకి ఎక్కించవచ్చు. దానికి సంబంధించిన సూచనలు చూసి పాటించండి. ఏమైనా సందేహాలుంటే ఇక్కడకన్నా, మీ వాడుకరి చర్చాపేజీ అనువైనది కనుక అక్కడే చర్చించండి. అర్జున (చర్చ) 04:16, 19 ఏప్రిల్ 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు --VJS (చర్చ) 12:43, 19 ఏప్రిల్ 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

కింగ్ డమ్ ను కలిపి రాయటం ఎలా?[మార్చు]

YesY సహాయం అందించబడింది


కింగ్ డమ్ ను కలిపి రాయాలి అంటే ఎలా చేయాలి --Kocherlakota Padmakar (చర్చ) 01:34, 2 సెప్టెంబరు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

@Kocherlakota Padmakar గారు, మీరు ZWNJ (Zero Width Non Joiner) అనే గుర్తుని వాడాలి. వికీపీడియాలో టైపింగ్ కువున్న లిప్యంతరీకరణ పద్ధతి వాడుతున్నట్లైతే వికీపీడియా:టైపింగు_సహాయం#zwnj లో ZWNJ ఉదాహరణ చూడండి. అర్జున (చర్చ) 10:55, 2 సెప్టెంబరు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]
Kocherlakota Padmakar గారూ మీరు డెస్క్ టాప్ లో లిప్యంతీకరణ వాడుతూ ఉంటే కింగ్ తరువాత ^ (shift 6) టైపు చేసి తరువాత డమ్ రాయవచ్చు ఉదాహరణ ఆన్‌లైన్ An^lain ,kiMg^Dam కింగ్‌డమ్ , మొబైల్ లో Gboard వాడుతున్నట్లు అయితే కీబోర్డులో మొదట కింగ్ అని టైపు చేసిన తరువాత స్పేస్ బార్ పక్కన నాలుగు నిలువు చుక్కతో ◀:▶ లాగ ఉన్న గుర్తును నొక్కి తరువాత డమ్ టైప్ చేయండి : Kasyap (చర్చ) 11:11, 2 సెప్టెంబరు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

9/11 దాడులు వ్యాసంతో సహాయం[మార్చు]

YesY సహాయం అందించబడింది

అమెరికా దేశ చరిత్ర, కాదు, ప్రపంచ చరిత్ర లో 9/11 ఒక ముఖ్యమైన సంగతి. ఈ వారం లో ఇరవై సంవరసార్లు anniversary గా. దయచేసి, కొంచం షాహాయం ఇవ్వు ఈ వ్యాసం improve కోసం. ధన్యవాడులు. MSG17 (చర్చ) 16:57, 7 సెప్టెంబరు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

కొంత సహాయం చేయబడింది కావున మూసను సహాయం చేయబడింది తో మార్చాను.--అర్జున (చర్చ) 12:39, 10 అక్టోబరు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఆర్టికల్ తోపాటుగా చిత్రాన్నిఎక్కించటం[మార్చు]

YesY సహాయం అందించబడింది

నేను వికీపీడియాలో ఆర్టికల్ తోపాటుగా చిత్రాన్ని జతపరచాలనుకుంటున్నాను ఇది నా స్వంత చిత్రం అయినప్పటికీ దానిని ఈ సారాంశంలో జతపరచలేకపోతున్న అది ఎలా చెయ్యాలో కాస్త వివరంగా తెలియజేయగలరు. —Varjiliya (చర్చ) 12:28, 8 అక్టోబరు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

@Varjiliya గారు, ఈ సందేహం చేర్చిన తరువాత మీరు చిత్రం ఎక్కించినట్లు గమనించాను. ఇంకా మీకు సందేహాలుంటే, మరల అడగండి. అర్జున (చర్చ) 12:35, 10 అక్టోబరు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

స్వాగతం మూస పనిచేయుటలేదు[మార్చు]

YesY సహాయం అందించబడింది

welcome to members page is not working. Sr members to please help me.-- 2021-10-10T06:18:05‎ Nrgullapalli

@User:Nrgullapalli಼಼, as per talk page comment, morebits module needs updation, or twinkle needs upgradation. Till it is completed, use manual welcome as described on {{Welcome}}--అర్జున (చర్చ) 12:33, 10 అక్టోబరు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]
నాగేశ్వరరావు, అర్జున గార్లు, నమస్తే, స్వాగతం మూస ఇప్పుడు పని చేస్తుంది. అండి. ధన్యవాదాలు.__Plume pen w.gifప్రభాకర్ గౌడ్చర్చ 06:20, 11 అక్టోబరు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]
@ప్రభాకర్ గౌడ్ నోముల గారు, స్పందనకు ధన్యవాదాలు. @Chaduvari గారు అవసరమైన మార్పులు చేశారు. వారికి ధన్యవాదాలు. అర్జున (చర్చ) 05:04, 12 అక్టోబరు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఐపీ అడ్రస్ బ్లాక్[మార్చు]

YesY సహాయం అందించబడింది

నా ఐపీ అడ్రస్ బ్లాక్ అయ్యిందని వస్తోంది. ఎందుకు అలా వస్తుందో, నేను చేసిన తప్పేంటో నాకు తెలియడం లేదు. ఏదైనా తప్పిదాలు ఉంటే చెప్పగలరు? సవరించుకుంటాను. —183.82.111.252 06:31, 10 డిసెంబరు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

@ ఐపి అడ్రస్ వాడుకరి గారు. మీరు పై వ్యాఖ్య రాశారు కాబట్టి, మీరు సమస్యగల కంప్యూటర్ కాక వేరే కంప్యూటర్ నుండి రాశారని భావిస్తున్నాను. గతంలో ఆ ఐపి అడ్రస్ వాడిన వాడుకరులు, వికీపీడియాలో దుశ్చర్యలకు పాల్పడినందున, నిర్వాహకులు ఆ ఐపి అడ్రస్ ను నిరోధించినట్లున్నారు. కావున మీరు పై వ్యాఖ్య చేర్చిన కంప్యూటర్ వాడి ఖాతా సృష్టించుకొంటే ఆ తరువాత మీ కంప్యూటరులో ఖాతా ద్వారా ప్రవేశించి వికీపీడియాలో కృషి చేయవచ్చు. మరింత సమాచారానికి వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_83#సహాయం చూడండి. అర్జున (చర్చ) 04:53, 11 డిసెంబరు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]
తెలుగు వికీపీడియా లో పనిచేయటానికి ఐపీ అడ్రస్ బ్లాక్ అయివుంటే, ఆంగ్ల వికీపీడియాలో ఖాతా సృష్టించుకొని ఆ తరువాత తెలుగు వికీపీడియాలో ప్రవేశించి పనిచేయవచ్చు. అర్జున (చర్చ) 03:00, 10 జనవరి 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]

సమాచార పెట్టే మూస దిగుమతి[మార్చు]

{{Infobox family}} ఈ సమాచార పెట్టేను దిగుమతి చేయండిCh Maheswara Raju☻ (చర్చ) 13:21, 4 మే 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]

@Ch Maheswara Raju గారు, నేను దిగుమతి చేశాను. మీరు ఇటువంటి అభ్యర్ధనలకు ఇకముందు, మీ చర్చాపేజీలో, {{సహాయం కావాలి}} చేర్చి అడిగితే సరిపోతుంది. ఈ పేజీ, పేజీపై సూచనలో తెలిపినట్లు ఖాతాలేని వారి సహాయం అభ్యర్ధనలకు మాత్రమే ఉద్దేశించినది. అర్జున (చర్చ) 03:10, 5 మే 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]

సందేహం respected sir, till now I have written four books. How to send my books for award. can you explain[మార్చు]

YesY సహాయం అందించబడింది


122.162.54.121 04:12, 17 మే 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]

మీకు సాహిత్య అకాడమీ వ్యాసం, ఆ వ్యాసం ఆంగ్లవికీరూపం, సాహిత్య అకాడమీ వెబ్సైట్ ఉపయోగపడవచ్చు. ఈ పేజీలో వికీపీడియా కృషిలో సమస్యలు మాత్రమే ప్రస్తావించాలి. మీ ప్రశ్నకు మెరుగైన పేజీ వికీపీడియా:సమాచార అన్వేషణ సంప్రదింపుల కేంద్రం. -- అర్జున (చర్చ) 05:35, 18 మే 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Sharing information regarding tourism[మార్చు]

YesY సహాయం అందించబడింది

Dear Team, we are from The Royal Tourism Hyderabad, we wre into tourism company we need to give more information to our public regarding tourism and travel

Regards, THE ROYAL TOURISM HYDERABAD.

2405:201:C021:11D4:9509:4A85:E7CE:7172 18:57, 11 ఆగస్టు 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Dear The Royal Tourism, Hyderabad,
Thanks for your question. You can read the articles related to tourism and improve them citing reliable sources. Editing with an account helps in discussions. Hope this helps. --అర్జున (చర్చ) 10:33, 12 ఆగస్టు 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]

సందేహం : వికిపీడియా లో నూతన వ్యాసం రాయడం ఎలా ?[మార్చు]

సహాయం కావాలి
క్రింది అభ్యర్ధన లేక చర్చకు స్పందించటం ద్వారా తెవికీ అభివృద్ధికి తోడ్పడండి. మరిన్ని వివరాలకు చూడండి {{సహాయం కావాలి}}.


202.65.159.180 06:09, 3 సెప్టెంబరు 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]

కింది లింకులను చూడండి:
  1. వికీపీడియా:కొత్తపేజీ మార్గదర్శకాలు - వ్యాసాన్ని సృష్టించే ముందు గమనించవలసిన అంశాలను చూపుతుంది.
  2. వికీపీడియా:కొత్త పేజీని ఎలా ప్రారంభించాలి - వ్యాసాన్ని సృష్టించే మార్గాలను చూపిస్తుంది.
  3. వికీపీడియా:వ్యాససృష్టికి మార్గసూచీ - ఇది ఒక్కొక్క అంగే వేయిస్తూ వ్యాసాన్ని సృష్టించడంలో ఇమిడి ఉన్న అంశాలను తెలుపుతూ మీచేత పేజీని సృష్టింప జేస్తుంది. విజార్డ్ అన్నమాట.
ఈ విషయంలో మీకేమైనా సందేహాలు కలిగినా, ఇబ్బందులు ఎదురైనా, మళ్ళీ ఇక్కడ రాయండి, లేదా నా చర్చ పేజీలో రాయండి. __
__ చదువరి (చర్చరచనలు) 00:08, 4 సెప్టెంబరు 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]